నీరు ఎంత తాగితే అంత మంచిదని నిపుణులు కూడా సూచిస్తుంటారు. చాలామంది బయట వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రతి వాటర్ బాటిళ్ల మూతలు వేర్వేలు రంగుల్లో ఉంటాయి. ఇలా ఎందుకు ఎంటాయోనని మీరెప్పుడైనా గమనించారా? రంగులకు అర్థం ఏమిటో తెలుసా? అసలైన, ఈ రంగులు సీసాలో ఎలాంటి నీరు నింపుతారో తెలియజేస్తుంది. ఈ రంగుల ద్వారా మీరు నీటి రకాన్ని ఎలా గుర్తించవచ్చు తెలుసుకుందాం. రైలు లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మనం తరచుగా వాటర్ బాటిల్ కొనుక్కుంటాము. ఈ బాటిల్స్ లో చాలా వరకు బ్లూ కలర్ క్యాప్ లు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బ్లూ కలర్ క్యాప్ ఉంటే ఆ నీరు మినరల్ వాటర్ అని అర్థం.
2023లో ఫుడ్ కలర్ కెమిస్ట్రి జర్నల్ లో పచురితమైన అధ్యాయనం ప్రకారం.. నీలిరంగు క్యాప్ తో ఉన్న నీటిలో సాధారణ నీటి కంటే 20% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జియాంగ్ సి యూనివర్సిటీ ఆఫ్ ట్రాడిషనల్ చైనీజ్ మెడిసిన్ లో ప్రోఫెసర్ డాక్టర్ జియాంగ్ యాన్ పాల్గొన్నారు. వాటర్ బాటిల్ క్యాప్ రంగులు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. తెల్లటి రంగు మూత ఈ నీరు సాధారణ తాగు నీరు అని చెబుతుంది. ఆకుపచ్చ రంగు రుచిగల నీటిని సూచిస్తుంది. ఇది కాకుండా, కొన్ని బ్రాండ్ లు తమ బ్రాండ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని మూత రంగులను ఎంచుకుంటాయి. అయితే ప్రతి బాటిల్ పై నీటి గురించిన పూర్తి సమాచారం రాసి ఉండటంతో గంధరగోళం అవసరం లేదు. ఎరుపు మూత మెరిసే ఉంటే కార్బోనేడెడ్ నీటిని సూచిస్తుంది.