చిన్నపిల్లలు డార్క్ చాక్లెట్ ని చాలా ఇష్టంగా తింటారు. చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్లు కూడా డార్క్ చాక్లెట్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. డార్క్ చాక్లెట్ చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. డార్క్ చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇది రుచిగా ఉండటమే కాదు దీనిని తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది కోకోబిన్స్ నుంచి తయారు చేస్తారు. ఇందులో బటర్, చక్కెర వంటి ఇతర పదార్థాలు కూడా ఉంటాయి.

 డార్క్ చాక్లెట్ లో కోకో శాతం ఎక్కువగా ఉండటం వల్ల, చక్కెర స్థాయిలో తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ప్లేవనాయిడ్స్ శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. డార్క్ చాక్లెట్లను తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ' ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రి ' లోని ఆధ్యాయణం ప్రకారం... డార్క్ చాక్లెట్లు తినటం వల్ల గట్ మైక్రోఒయోమ్ లో పెరుగుదలను పెంచుతుందని తెలిపారు. ఇది మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది. డార్క్ చాక్లెట్ లో ఫెనిలేథైలమైన్ పదార్థాలు మానసిక స్థితిని నియంతరించడంలో తోడ్పడతాయి.

అంతేకాదు, ఈ డార్క్ చాక్లెట్ తినటం వల్ల 50 శాతం వరకు హాట్ స్ట్రోక్ ను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు కొద్ది మొత్తంలో వీటిని తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయని పలు ఆధ్యాయణాలు తెలుపుతున్నాయి. డార్క్ చాక్లెట్లు అన్నీ ఒకే రకంగా ఉండవు. వీటిని తినే ముందు చక్కెర తక్కువ ఉన్న వాటిని ఎంచుకోవటం మంచిది. చక్కెర స్థాయిలు తక్కువ ఉన్న వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. డార్క్ చాక్లెట్లను రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వీటిల్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కొనే ముందు నాణ్యమైనావా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: