ఒత్తిడి, రోగనిరోధకత, ఎముకలను దృఢంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది. చెరుకు రసం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు రసంలో గ్లైకోలిక్ ఆల్ఫా మైడ్రాక్సి వంటి అమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో తోడ్పడుతుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. మూడు టేబుల్ స్పూన్లు చెరుకు రసంలో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాయాలి. 10 నిమిషాల తర్వాత గోలు వెచ్చని నీటితో పేస్ క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు రోజులు చేయటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చెరుకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి, ఆవిష్యమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
దీనివల్ల ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోయి, చర్మ కణాలను మెరిసేలా చేస్తుంది. తేనెతో చెరుకు రసం ను కలిపి చర్మానికి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. 10 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి కడిగేయాలి. వారానికి 3 సార్లు ఇలా చేయటం వల్ల చర్మం వ్రుధువుగా మారుతుంది. కాఫీ పొడిలో కెఫీన్, ఇతర గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి. కాస్త చెరుకు రసంలో కొంచెం కాఫీ పొడిని కలిపి స్క్రబ్ లా ఉపయోగించడం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోతాయి. చాలామంది ముఖానికి ఐస్ క్యూబ్ వాడుతుంటారు. ఇలా మామూలు క్యూబ్ లు కాకుండా చెరుకు రసంతో తయారు చేసిన వాటిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.