ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ కాల్షియం కోపం అనేది వస్తుంది. ఈ లోపం రాకుండా ఉండాలంటే ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవాలి. వా శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన ఖనిజాల్లో కాల్షియం ఒకటి. ఎముకలు, దంతాలు, కండరాల బలానికి, వాటి సామర్థవంతమైన పనితీరుకు ఇది చాలా ముఖ్యం. ఒకప్పుడు మిడిల్ ఏజ్ గల వారిలోనే ఈ లోపం ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుతం యువతరాన్ని కూడా వేధిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 22 శాతం మంది యువతి యువకులు కాల్షియం లోపంతో తమ తమ పనుల్లో, కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా శరీరానికి తగిన మేరకు పోషకాలు అందకపోవడం, అధిక కేఫిన్ వినియోగం, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటి యువతలో కాల్షియం లోపానికి కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితి బలహీనమైన ఎముకలు మొదలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాంటి వాటిలో కండరాల తిమ్మిరి ఒకటి.

నరాలు, కండరాల సంకోచానికి, అవి బలంగా ఉండటానికి కాల్షియం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం యువతలోనూ ఇది లోపిస్తోంది. దీనిని భర్తీ చేయడంలో పాలు, పెరుగు, జున్ను, కూరగాయలు వంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవటం అవసరం. ఆరోగ్యాన్నిపుణుల సూచనలను బట్టి లోపాన్ని అధిగమించడానికి అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లు కూడా యూజ్ చేయవచ్చు. గోర్లు సాధారణం కంటే తెల్లగా, బలహీనంగా, పెళుసుగా మారడం వంటి లక్షణాలు కూడా కాల్షియం లోపానికి సంకేతాలుగా ఆరోగ్యాన్ని పులులు పేర్కొంటున్నారు. గోర్లలో ఎంతో కీలకమైన కెరాటిన్ అనే ప్రోటీన్ తయారు కావడానికి కాల్షియం చాలా ముఖ్యం. ఒకప్పుడు మిడిల్ ఏజ్ గల వారిలోనే ఈ లోపం ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుతం యువతరాన్ని కూడా వేధిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: