వెజ్ కర్రీస్ ఏ నాన్ వెజ్ ఇలా వండటం మీరెప్పుడైనా చూశారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? వెజ్ కర్రీస్ లో నాన్ వెజ్ లో తయారు చేసుకుని తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజుల్లో వెజ్, నాన్ వెజ్ పదార్థాలు ఏవో అర్థం కాకుండా పోతుంది. రోజు ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు నాన్ వెజ్ కిందకి వస్తాయంటే నమ్ముతారా? సాధారణంగా కొంతమంది వెజిటేరియ్ వాళ్లు అసలు నాన్ వెజ్ తినరు. అది వారి ఆచారాలు, సాంప్రదాయాల కారణంగా కావచ్చు. మరికొందరు డైట్ ఫాల్ అవుతుంటాం అంటూ నాన్ వెజ్ ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ, వెజిటేరియన్స్ తెలియక నాన్ వెజ్ ఫుడ్స్ ను తినేస్తున్నారు.

 ఇవి శాకాహారంలా కనిపించే మాంసాహార పదార్థాలు. అదేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది బటర్ తో చేసిన పదార్థాలను ఇష్టంగా తింటుంటారు. రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు వెజిటేరియన్స్ బటర్ నాన్ ను ఆర్డర్ చేస్తారు. ఇది వెజిటేరియన్ అనుకుని తింటుంటారు. కానీ, నిజానికి ఇది వెజ్ కాదు. బట్టర్ నాన్ ను తయారు చేసేందుకు కావలసిన పిండిలో ఎగ్ కలుపుతారు. దీనివల్ల పిండి సాఫ్ట్ గా మారుతుంది. కొన్ని రెస్టారెంట్స్ లో మాత్రం వీటిని ఎగ్ కలపకుండానే పిండిని ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఒక్కసారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు దాని గురించి అడిగిన తర్వాత తినటం మంచిది.

కొందరు వెజిటేరియన్స్ శాండ్ విజ్, పిజ్జా వంటివి నాన్ వెజ్ కు ఆల్ట్రానెట్ గా తింటుంటారు. వీటిలో ఉండే చీజ్ ను ఎంతోమంది ఇష్టపడుతుంటారు. చీస్ అంటే చాలామందికి ఫేవరెట్ ఐటమ్. అయితే, ఈ చీజ్ లో రెన్నెట్ అని ఎంజైమ్ ఉంటుంది. దీనిని జంతువు కడుపు నుంచి తీస్తారు. కాబట్టి ఇది నాన్ వెజ్ కిందకే వస్తుంది. చీస్ ను తినాలని అనుకునే వారు దీనిని కొనే ముందు ప్యాకెజ్ కవర్ పై ఉన్న ఇంగ్రిడియన్స్ ను చెక్ చేసుకోవటం ఉత్తమం. పందార అనేది చెరుకు నుంచి వస్తుంది. ఇది వెజిటేరియన్ అని అనుకుంటారు. కానీ, దీనిని పాలిష్ చేసేటప్పుడు ఫ్యాక్టిరి లో బోన్ చార్ ను ఉపయోగిస్తారు. అంటే జంతువుల ఎముకల నుంచి తయారు చేసిన పౌడర్ ను వాడుతుంటారు. ఇది వెజిటేరియర్ కాదు. అయితే, అన్ని రకాల పంచదారలో దీనిని కలపరు.

మరింత సమాచారం తెలుసుకోండి: