అలాగే వాతావరణ కాలుష్యం, చార్మా సమస్యలు, చమటలు రావడం, దురద వంటివి కూడా ఇందుకు కారణం అవుతుంటాయి. ప్రాబ్లం నుంచి బయటపడేందుకు రకరకాల షాంపులు వాడుతుంటారు. అయినా కొన్నిసార్లు పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. షాంపూల్లో కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కొందరికి ఇది పడక కూడా డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు హెయిర్ మాస్క్ యూస్ చేయటం, టూ వీలర్ పై తిరిగే వారైతే హెల్మెట్ ధరించడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. అలాగే తలస్నానం చేసినప్పుడు సబ్బు గాని, షాంపూ గాని ఒకటి, రెండుకంటే ఎక్కువసార్లు పెట్టుకోవద్దు. చాలామంది స్నానం తరువాత జుట్టు ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ వాడుతుంటారు.
చుండ్రు సమస్య ఉన్నవారు వాడకపోతే బెటర్. అలాగే ఈ సమస్య దాదాపు అందరూ వైట్ హెయిర్ కవర్ చెయ్యడానికి కలర్ వేస్తుంటారు. ఆ కలర్ మీ శరీరానికి పడకపోయినా చుండ్రు సమస్య వస్తుంది. కాబట్టి బ్రాండ్ మార్చి చూడవచ్చు. అప్పుడప్పుడు లేదా వీక్లీ వన్స్ తలకు ఆయిల్ మసాజ్ చేయటం వల్ల డాండ్రఫ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ముందుగా మసాజ్ చేసి, ఆ తరువాత షాంపూ లేదా సబ్బుతో కడిగి జుట్టును ఆరబెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. ఇటువంటి వారణ చర్యల తరువాత కూడా డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గకపోతే చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.