కాగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంకంటే ఎక్కువగా తినటం అనేది ఒక వ్యసనంగా మారినప్పుడు ' ఓవర్ ఈటింగ్ డిజార్డర్' గా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఆహార పదార్థాలు కంట్రోల్ చేసుకోలేరు. కొద్దిగానే తినేద్దామనుకోని ప్రారంభిస్తారు కానీ... ఆ సంగతే మర్చిపోయి అతిగా లాగించేస్తుంటారు. కాబట్టి ఈ రుగ్మత ఉన్నవారు అన్నం, ఇతర పదార్థాలు తినేందుకు చిన్న ప్లేట్ వాడడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ ఆహారం పడుతుంది.
దీంతో రెండవసారి వడ్డించుకునేందుకు గ్యాప్ దొరుకుతుంది. మళ్లీ వడ్డించుకోవాలనుకునే సరికి తక్కువగా తినాలి కదా... అనే విషయం గుర్తుకు వస్తుంది. కాబట్టి అంతటితో ఆపేస్తారు. అదే పెద్ద ప్లేట్ అయితే ఒకేసారి ఎక్కువ ఆహారం వడ్డించుకుంటారు. రెండవసారి కూడా అదే జరుగుతుంది. త్వరగా తినడం వల్ల కూడా కొందరు ఆత్రుతలో ఎక్కువగా లాగించేస్తుంటారు. అలా జరగదంటే... స్లోగా తినాలంటున్నారు నిపుణులు. మెల్లిగా తింటూ... ఆహారాన్ని బాగా నములుతూ రుచిని ఆస్వాదించాలి. దీంతో ఎక్కువ సేపు తిన్న ఫీల్ కలుగుతుంది. అలాగే ఆహారం మధ్య మధ్యలో మీరు తాగుతూ ఉంటే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అప్పుడు తక్కువగా తింటారు. సాధారణంకంటే ఎక్కువగా తినటం అనేది ఒక వ్యసనంగా మారినప్పుడు ' ఓవర్ ఈటింగ్ డిజార్డర్' గా మారుతుందని నిపుణులు అంటున్నారు.