భార్యాభర్తలు కొత్తగా పెళ్లయిన వారు అన్యోన్య దాంపత్యాన్ని కోరుకుంటాడు. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు పెళ్లయిన కొత్తలో కొంతకాలం వరకు సంతోషంగా ఉన్నప్పటికీ... కాలం గడుస్తున్న కొద్ది చిన్న చిన్న గొడవలు, కొన్ని విషయాల్లో మనస్పర్థలు రావడం సహజమే. నువ్వేంత అంటే నువ్వేంత అని గొడవలు  పడితే... ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇది ఎలాంటి పరిస్థితులకైనా దారితీయవచ్చు. అలాంటివి జరగకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

దానికి తప్పులు అనేది ఇద్దరిలో ఎవరివల్లనైనా జరగవచ్చు. కొంతమంది భాగస్వామి చేసిన చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేస్తూ... భూతద్దంలో చూస్తుంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది. అలాకాకుండా ఆ తప్పు చేయడానికి గల కారణాలు తెలుసుకుని, దానికి పరిష్కారాన్ని వెతకాలి. భాగస్వామితో ఎలాంటి విషయాన్ని అయినా పంచుకునే ఉండాలి. వ్యక్తిగత జీవితాల్లోని సమస్యల గురించి మాట్లాడితే.. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొందరు భయం లేదా సంశయంతో కొన్ని విషయాలను భాగస్వామికి చెప్పకుండా దాచిపెడుతుంటారు. ఇలా చేయటం వల్ల వారికి ఏదో ఒక రోజు నిజం తెలిసినప్పుడు మీ పైన నమ్మకాన్ని కోల్పోతారు.

అందుకే వీలైనంతవరకు ప్రతి విషయాలను భాగస్వామికి చెప్పడం మంచిది. సంసారంలో భార్యాభర్తల ఇద్దరూ ఒక్కటే అనుకుంటే ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. అలా కాకుండా తనదే పై చేయి కావాలి, తనమకు నచ్చినట్లుగా జరగాలి, ప్రతి విషయం తనకు తెలియాలనుకుంటే మాత్రం అది అవతలి వ్యక్తికి ప్రశాంతత, సహనంను కోల్పోయేలా చేస్తాయి. ఇది ఎలాంటి పరిస్థితుల కైనా దారితీయవచ్చు. ఒక అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ తర్వాత సొంత అభిప్రాయాన్ని వ్యక్తం పరచాలి. అంతేకానీ బాగా స్వామి నిర్ణయాలు ఎప్పుడూ తప్పని భావించకూడదు. కొంతమంది భాగస్వామి చేసిన చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేస్తూ... భూతద్దంలో చూస్తుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: