ఈరోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా బయట ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ని ఇస్తున్నారు. పిజ్జా లేదా బర్గర్స్ ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నేటి కాలంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీనినే ఇష్టపడుతున్నారు. నేటి కాలంలో అధికమంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా పిజ్జాలు, దగ్గర్లో వేళాపాళా లేకుండా లాగించేవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి వారికి పరిశోధకులు షాకింగ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే.. పిజ్జా, బర్గర్లు, మోమోస్ వంటి అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం వల్ల 50 ఏళ్ల లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో జీర్ణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా ఆధ్యాయనం వెల్లడించింది.

 ఇటీవల ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీలో రెడ్ మీట్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై పరిశోధన నిర్వహించగా, వీటిని తీసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిపింది. పిజ్జా, బర్గర్లు, మోమోస్ ట్వంటీ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల శరీరంలో మంట పెరుగుతుందని, దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇపునుల అభిప్రాయం ప్రకారం పెద్ద ప్రేగు క్యాన్సర్ కేసుల పెరుగుదల 50 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే ఎక్కువ గా కనిపిస్తుంది.

 నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం, వేయించిన ఆహారాలు, చక్కెర పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఈ ఆహారాలలో కొవ్వు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో మంట, క్యాన్సర్ కారకాలను పెంచుతాయి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ రసాయనాలు, తృతీయ సంకలితాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని జీర్ణ క్రియను అసమతుల్యత చేస్తాయి. ఇది ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయడం ద్వారా క్యాన్సర్ కణాలను పెంచుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం, తక్కువ చక్కెర, ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: