అన్ని పనులపై ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు డిప్రెషన్కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా డిప్రెషన్కు లోన్ అవుతారు. కాగా డిప్రెషన్ ను మందులలో కాకుండా న్యాచురల్ గా తగ్గించుకోవాలంటే నిపుణులు చెప్పిన విధానం చేయండి. డిఫరెన్స్ అంటే చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా యోగా చేయాలి. ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేయాలి. తరువాత మెల్లిమెల్లిగా వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎక్సర్సైజులు చేయాలి. జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్,
యోగా వల్ల డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు. ఎప్పుడైనా సరే పాజిటివ్ గా ఆలోచించాలి. విజయాలను నెమరువేసుకోవాలి. ఒక్కసారిగా డిప్రెషన్ కు లోనైతే... ఏ పని చేయడానికి ముందడుగు వెయాలనిపించదు. బాగా గతంలో సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తు చేసుకోవాలి. ఎక్కువగా మీ మనసుకు నచ్చిన సాంగ్స్ వినండి. అలాగే పుస్తకాలు చదవండి. ఏదైనా పనిలో నిమఘ్నుమైతే...ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామో ఆ బాధ నుంచి బయటపడతారు. అలాగే నాణ్యమైన ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, డి ఆహారంలో భాగం చేసుకోవాలి. మిమ్మల్ని మీర హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి వాటర్ ఎక్కువగా తాగాలి. కాగా డిప్రెషన్ ను మందులలో కాకుండా న్యాచురల్ గా తగ్గించుకోవాలంటే నిపుణులు చెప్పిన విధానం చేయండి.