దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. గుమ్మడి గింజలను తినటం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు అధికమవుతాయి. నాడీ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తుంది. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా కణాలు ఆక్సికరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది. వీటిని నేరుగా తినలేని వారు రోస్ట్ చేసుకొని గాని సలాడ్, సూప్ లపై చల్లుకుని తీసుకోవచ్చు. గుమ్మడి విత్తనాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని మెలటోన్ ఉత్పత్తిని అధికం చేసి, నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులోని విటమిన్ ఈ ... ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. వీటిని ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవచ్చు.
ఏమిగుమ్మడి విత్తనాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే జింక్ ప్రోస్టేట్ ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. గుమ్మడి విత్తనాలను తరచుగా తినటం వల్ల బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ ప్లేసియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది హార్మోన్లు అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రశయం ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. గుమ్మాడి గింజలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఈ సీట్స్ తినటం వల్ల గుండె రక్తనాళాల్లో గడ్డలు రాకుండా నివారిస్తుంది. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. వీటిని రోజూ తినటం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య నుంచి రక్షిస్తుంది.