చాలామంది ఐస్ బాత్ స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం చన్నీళ్ళ స్నానం అంటే అసలు ఇష్టపడరు. చాలామంది చల్లని నీటితో స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. కొందరు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడుఒడితే అప్పుడు చల్లటి నీటితో స్నానం చేస్తారు. చాలామంది సెలబ్రిటీలు కూడా బకెట్ ఛాలెంజ్ అంటూ చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. లేదా ఎక్కడికైనా వెల్లినప్పుడు ఈ ఐస్ క్యూబ్ ను ట్రై చేస్తారు. ఈ ఐస్ బాత్ ని క్రయోథెరపి అని అంటారు. కొందరు చల్లటి నీటిలో స్నానం చేయడానికి అస్సలు ఇష్టపడరు.

కానీ, చల్లటి నీటితో స్నానం చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఐస్ బాత్ ను 5 నుంచి 15 నిమిషాల పాటు 10 డిగ్రిల సెల్సియస్ చల్లటి నీటిలో శరీరాన్ని ఉంచుతారు. ఇలా చేయటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి, శరీరానికి మంచి అనుభూతిని ఇస్తుంది. శరీరం అంతా చల్లటి నీటిలో ఉంచడం వల్ల రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్లపై సాకూల ప్రభావం చూపుతుంది. మానసిక స్థితి శక్తిస్థాయిలను పెంచుతుంది. ఐస్ వాటర్ తో స్నానం చేయటం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

బాగా వ్యాయామం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయటం వల్ల కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. చన్నీటి స్నానం జీవక్రియను ప్రేరేపిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తరచుగా ఐస్ బాత్ చేయటం వల్ల జీవక్రియ రేటు పెరిగి, శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లని నీటిలో ఉంచడం వల్ల రక్తనాళాల్లో పాపు తగ్గుతుంది. శరీరం, కండరాలలో గాయాలు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐస్ బాత్ చేయటం వల్ల రక్తనాళాలు సంతోషిస్తుంటుంది. కండరాల నుంచి లాక్టిక్ యాసిడ్, ఇతర జీవక్రియ వ్యర్థాలను బయటకి పంపడంలో సహాయపడతాయి. కండరాల పునరుద్ధరణను పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: