అయినప్పటికీ పురుషాధిక్య భావజాలమే ఏదో ఒక రూపంలో నేటికీ డామినేట్ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు స్త్రీ వాదులు. ఇలాంటి పరిస్థితులే నేటికీ అమ్మాయిలు కొన్ని విషయాల్లో ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యంగా మెంటల్ హెల్త్ విషయంలో మహిళలు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మహిళల రోజు వారి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మెంటల్ హెల్త్ ఒకటి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఇండియాలో స్త్రీల మనోభావాలు, మనసులో మాటలు, మానసిక ఆరోగ్యం వంటి విషయాలు అంతా ప్రయారిటీ గల అంశంగా పరిగణించని వారే చాలామంది ఉంటున్నారని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
పురుషులు తమ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడినంతగా ఓపెన్ గా స్త్రీలు మాట్లాడుకునే పరిస్థితి ఇప్పటికీ లేదు. ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా తప్పుగా అర్థం చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ, రుతుస్రావం, ఇష్టాయిష్టాలు బయటకు మాట్లాడుకూడనివిగా భావిస్తుంటారు చాలామంది. దీంతో ఎలాంటి అంశాల్లో సందేహాలు వచ్చినా, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బయటకు మాట్లాడితే ఇతరులు ఏమనుకుంటారోననే ఫీలింగ్ ఆధునిక మహిళలను పైతం వెంటాడుతోంది. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటి, డిజార్డర్ వంటివి ప్రపంచవ్యాప్తంగా స్త్రి, పురుషులందరూ ఎదుర్కొనే సమస్యలుగా ఉన్నాయి.