అయితే ఈ అలవాటు పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలుసా. ఇప్పుడు కాలంతో పాటు పరుగులు పెట్టాల్సిందే. దీంతో నేటి జనరేషన్ తినడానికి కూడా తగిన సమయం కేటాయించే స్టేజ్ లో లేరు. పిల్లలు సులభంగా ఆహారం తినడానికి తల్లిదండ్రులు ఎంచుకున్న మార్గం...సెల్ ఫోన్. అదిగా తింటే ఊబకాయం, తక్కువ తింటే పౌష్టికాహార లోపం రావచ్చు. ఫోన్ చూస్తూనే పిల్లవాడు ఆహారాన్ని నమాలకుండా నోట్లో పెట్టుకుని మింగేస్తూ ఉంటాడు. ఇది జీవక్రియను బలహీన పరుస్తుంది. అంతేకాదు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తినే సమయంలో ఫోన్ చూడటం వల్ల పిల్లల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని... జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయని ఢిల్లీలోని ఎయిమ్స్ లోని పిడియాట్రిక్ విభాగంలో డాక్టర్ రాకేష్ కుమార్ వివరిస్తున్నారు. ఎందుకంటే పిల్లవాడు ఫోన్ ని చూస్తూ ఎక్కువ తింటాడు లేదా తక్కువ తింటాడు.
ఇది అజీర్ణం, గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది. ఫోన్ చూసే పిల్లల కళ్లు చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. పిల్లల కళ్ళు అలసిపోవచ్చు. అంతేకాదు చిన్న వయసులోనే అనేక కంటి సమస్యలకు దారి తీయవచ్చని చెప్పారు. భోజనం చేస్తూ ఫోన్ వైపు చూడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం పాడు అవుతుంది. ఫోన్ చూస్తూ పిల్లవాడు సరిగ్గా తినకపోవడం. తినే ఆహారంపై దృష్టి పెట్టక పోవడమే దీనికి కారణం. శరీరానికి పోషకాహార లభించదు. హార్మోన్ స్థాయిలు క్షిణిస్తాయి. ఇది పేలవమైన మానసిక ఆరోగ్యానికి కారణం కావచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఫోన్ కి అడిక్ట్ అవ్వడం వల్ల పిల్లల సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటాయని డాక్టర్ రాకేష్ వివరించారు.