ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. బాడీలో బ్లడ్ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినంత రక్తం ఉండాలి. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. అయితే వాటి పనితీరు మందగించినప్పుడు, సరిగ్గా రక్తాన్ని ఉత్పత్తి చెయ్యలేవు. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. సాధారణంగా శరీరానికి పోషకాల్లో ఐరన్ లోపించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు రక్తహీనత వల్ల ఏర్పడే లక్షణాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తరచుగా తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు శరీరంలో తగినంత రక్తం లేనప్పుడు కనిపిస్తాయి. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోవచ్చు. అలాగే కొందరిలో ఛాతిలో నొప్పిగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఊపిరి తీసుకోవటం కష్టంగా మారుతుంది. ఏకాగ్రత లోపించడం, తరచుగా అలసట, చిన్న చిన్న పనులకే నిరసించిపోవడం వంటివి రక్తహీనత ఉన్న వారిలో సాధారణంగా కనిపించే సింప్టమ్స్. ఇలాంటప్పుడు రక్తాన్ని ప్రొడ్యూస్ చేయగల పోషక ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవసరం అయితే వైద్య నిపుణులను సంప్రదించాలి. పిల్లల్లో రక్తహీనత విషయానికి వస్తే వారు ఆహారం తినడానికి ఆసక్తి చూపకపోవచ్చు. కొంతమంది పిల్లలు మట్టి, సున్నం, చాక్ పిస్ వంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. కొందరు పెద్దల్లోనూ ఇలాంటి కోరికలు కలుగవచ్చు.

దీంతో పాటు తరచుగా కాళ్లు, చేతులు ఆకారణంగా తిమ్మిరి పట్టడం, ఆకారణంగా అప్పుడప్పుడు వణకడం వంటి లక్షణాలు ఉంటాయి. మరి కొందరు రాత్రిపూట తరచుగా కాళ్లను కదిలిస్తూనే ఉంటారు. దీనిని రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. రక్తహీనత ఉన్న వారిలో, బాడీలో ఐరన్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. జుట్టు చిట్లిపోవడం లేదా రాలడం వంటి ఇబ్బందులు తరచుగా ఎదుర్కొంటున్నట్లయితే కూడా రక్తహీనత వల్లే కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా చలి పెట్టడం, ఆందోళనగా అనిపించడం వంటివి కూడా రక్తహీనత లక్షణాలుగా పేర్కొంటున్నారు. వీటిని గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోని వైద్య నిపుణులను సలహాలను పాటించాలి. ఆహారాల విషయానికి వస్తే నట్స్, ప్రూన్, పచ్చి బఠానీలు, తృణధాన్యాలు, పాలు, గుడ్లు, మాంసం, ఆఫ్రికాట్, బ్రోకలీ, ఎండు ద్రాక్షతోపాటు సీజనల్ కూరగాయలు, పండ్లు వంటివి తింటూ ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: