నీ హెల్త్ డైట్ లో గుడ్లను చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు సైతం అంటున్నారు. కానీ చాలామంది ఉడకబెట్టిన గుడ్లు తింటే మంచిదా? ఆమ్లెట్ తింటే మంచిదని తికమక పడుతుంటారు. కొంతమంది ఈ రెండు రకాల ఆహారాలను ఉదయం అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. రెండు ఎంపికలు రుచికరమైనవే. కానీ ఏది మంచిదన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ విషయం ఇక్కడ తెలుసుకుందాం. గుడ్లు ఉడికించి తినటం ఆరోగ్యకరం. ఈ పద్ధతి చాలా పోషకాలను పొందడానికి సహాయపడుతుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం... ఉడికించిన గుడ్లలో 6 గ్రాముల అధిక నాణ్యత ప్రోటీన్ ఉంటుంది.
ఇది కండరాల పెరుగుదలకు, కండరాలను బలోపేతం చేయడానికి అద్భుతమైన ఎంపిక. అంతేకాకుండా ఉడికించిన గుట్లలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలతో పాటు B12, A, D వంటి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. దరువు పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా, ఉడికించిన గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వయస్సు సంబంధిత కంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషన్లో పరుచూరించబడిన ఆధ్యాయణం కూడా శరీర మొత్తం ఆరోగ్యానికి గుడ్లు ఎంతో ఉపయోగపడతుందని వెల్లడించింది. సాధారణంగా ఆమ్లెట్ కూరగాయలు, చీజ్, మాంసం వంటి అనేక రకాల ఇతర పదార్థాలతో కలిపి తయారుచేస్తారు.