మనం ఉండే ప్రతి వంటకాల్లో కూడా పసుపుని తప్పకుండా వాడతాము. పసుపు ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. పసుపు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇతర సమస్యలే కాకుండా.. డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేసే గుణాలు పసుపులో ఉన్నాయట. షుగర్ వ్యాధికి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి మహమ్మారి చాప కింద నీరుల వ్యాప్తి చెందుతుంది. ఈ షుగర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిస్ ను తగ్గించేందుకు ఇప్పటికీ సరైన మందు లేదు. కేవలం ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఎన్నో రకాల వ్యాధుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో పసుపు కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు అన్ని ఇన్ని కావు. కొన్ని ఆధ్యాయనాల ప్రకారం షుగర్ ఉన్నవారు తరచూ పసుపుని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. నాచురల్ గానే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. పసుపును ఎప్పుడూ తీసుకునేటట్టుగా కాకుండా ఇప్పుడు చెప్పినట్లుగా తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ మీరే పొందుతారు.

మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. దాల్చిన చెక్క పొడి తో కలిపి పసుపు కూడా తీసుకోవచ్చు. ఈ రెండిటిలో కూడా అనేక ఔషధాలు ఉన్నాయి. ఈ రెండిటిని పొడిలా చేసి.. ఉదయాన్నే గోరువెచ్చటి పాలల్లో కలిపి తాగవచ్చు. ఇవి ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. పసుపు మిరియాలను కలిపి తీసుకున్న డయాబెటిస్ అనేది కంట్రోల్ అవుతుంది. కేవలం డయాబెటిస్ మాత్రమే కాకుండా సీజనల్ వ్యాధులు కూడా త్వరగా రాకుండా ఉంటాయి. ఓ గ్లాస్ గోరు వెచ్చని పాలలో మిరియాలు, పసుపు కలిపిన పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: