ప్రతి ఒక్కరికి జీవితంలో తోడు తప్పకుండా ఉండాలి. గతంలో సరైన వయస్సులో పెళ్లి చేసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే 30 ఏళ్లు వచ్చిన కూడా పెళ్లి ప్రస్తావనే ఉండదు.  డబ్బు, కెరీర్ అంటూ పెళ్లిని పక్కకి పెట్టేస్తున్నారు.  ఇప్పుడు పెళ్లి 40 ఏళ్లకు చేరింది. సమాజంలో జరుగుతున్న సంఘటనల వల్ల ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం వంటి కారణాల వల్ల పెళ్లికి యువత నిరాకరిస్తోంది.  దేశంలో పెళ్లికి నిరాకరిస్తున్న యువత రోజురోజుకీ పెరుగుతుంది.



యువత పెళ్లికి నిరాకరించడానికి ముఖ్య కారణం ఆర్థిక సమస్యలు.  నిశ్చితార్థం నుంచి మొదలైన ఖర్చు ఆగకుండా జీవితాంతం ఉంటుంది.  పైగా ఆర్థిక సమస్యలతో ఉంటే పెళ్లి చేసుకున్న వారిని సంతోషంగా చూడలేమని ఫీల్ అవుతారు.  చాలా మంది యువత చాలా తక్కువ జీతం నెలకు సంపాదిస్తున్నారు.  వచ్చిన జీతం వారి ఖర్చులకే సరిపోదు. ఇంకా పెళ్లి అంటే భార్య, పిల్లలు, వారి చదువులు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వనప్పుడు పెళ్లి ఎందుకని ఆలోచించి పెళ్లి విషయంలో ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు.  


పెళ్లి చేసుకున్న వారి కంటే చేసుకోని వారే సంతోషంగా ఉంటున్నారు. అందుకే యువత పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఒకవేళ పెళ్లి చేసుకున్న గొడవలు, ఏడుపులతో పెద్దది చేసుకుని విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని కనీసం ఏడాది కాకుండానే విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని విడిపోయే దానికి ఎందుకని యువత పెళ్లికి నిరాకరిస్తున్నారు. వీటితో పాటు ఈ జనరేషన్‌లో కూడా తమని అర్థం చేసుకునే పార్ట్‌నర్ ఉండరని భావించి పెళ్లికి దూరంగా ఉంటున్నారు.


ఇండిపెండెంట్‌గా, నచ్చినట్లు ఉండటానికి యువత ఇష్టపడుతున్నారు. అమ్మాయిలు అయితే ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్లకి నచ్చినట్లు ఉండాలని కోరుకుంటున్నారు. అదే పెళ్లి చేసుకుంటే నచ్చినట్లు లైఫ్ ఉండదని భావించి పెళ్లి చేసుకోవడం లేదు. అమ్మాయి లేదా అబ్బాయి అయిన ఇతరులకు నచ్చినట్లు ఎందుకు ఉండాలి? ఫ్రీడమ్ ఉండదని భావించి పెళ్లికి కాస్త దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పెళ్లి చేసుకుని బాధలు పడటం కంటే ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: