ఈ మధ్యకాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్ కి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటున్నారు . స్మార్ట్ఫోన్ లేకపోతే వారికి టైమే గడవడం లేదు . నేటి తరం పిల్లలు ఫోన్ వినియోగం ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. గంటల తరబడి ఫోన్లోనే మునిగిపోతూ ఉంటున్నారు . తిండి వంటివి లేకుండా అయినా ఉండగలరు కానీ స్మార్ట్ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు నేటితరం యువత . ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే మరీ ఎక్కువ . గేమ్స్ ఆడడం మరియు వీడియోలు చూడడం అదేవిధంగా అన్నం తినడం లేదని పేరెంట్స్ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వీడియోలు చూపించడం .. ఇలా పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు . దీంతో పిల్లలు మానసికంగా మరియు అనారోగ్యకారంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు .

కాదా పిల్లలు ఎంత సేపు ఫోన్ చూడాలి? ఏ వయసు బట్టి ఎంత టైం వరకు చూడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం . రెండు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు మొబైల్ అసలు ఇవ్వరాదు . రెండేళ్లు గడిచినా పిల్లలకు అంటే రెండు లేదా మూడు ఎలా వారికి ఒక గంట పాటు స్మార్ట్ ఫోన్ ఇవ్వవచ్చు . ఇక 8 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు రోజుకు ఒక రెండు గంటల పాటు స్మార్ట్ ఫోన్ ఇవ్వవచ్చు . కానీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు? ఎందుకు ఫోన్ వాడుతున్నారో నిరంతరం గమనిస్తూ ఉండాలి . గేమ్లు మరియు వీడియోలు చూసేందుకు అతిగా అలవాటు పడకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి . ఫోన్ ఎక్కువగా వాడితే శారీరకంగా మరియు మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది . స్క్రీన్ ఎక్కువ సమయం పాటు చూస్తే కంటి చూపు మందగిస్తుంది .

 తలనొప్పి కూడా వస్తుంది . వీటితో పాటు కళ్ళు నొప్పులు మరియు జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది . నిద్రపై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది . అలాగే పిల్లలు ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ చూస్తే ఇతరులతో కలవలేరు . దీంతో కమ్యూనికేషన్ దెబ్బతింటుంది . ఫోన్ పట్టుకుని ఒకే దగ్గర కూర్చోవడం వల్ల శారీరిక శ్రమ తగ్గుతుంది . కాగా పిల్లలు ఫిట్గా ఉండలేరు . దీంతో ఫ్యూచర్లో ఊబకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది . ఫోన్లో మునిగిపోవడం వల్ల కొంతకాలం తర్వాత ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు . డిప్రెషన్ కు లోన్ అవుతారు . మానసిక ఆరోగ్యం నశించిపోతుంది . కొన్ని రకాల కంటెంట్ పిల్లల మనసుపై మరియు తమ హ్యాబిట్స్ పై ఎఫెక్ట్ చూపుతోంది . అంతేకాకుండా ముఖ్యంగా మెమొరీ లాస్ అవుతుంది . పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే అని నిపుణులు సూచిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: