మధురలో జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ అధ్వర్యంలో రెండు రోజుల క్రితం బిఎస్ ఏ ఇంజినీరింగ్ కళాశాలలో ముఖ్య మంత్రి సామూహిక వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు రూ. 35 వేల నగదు తో పాటు పెళ్లి ఖర్చుకు రూ.5 వేలు, గృహోపకరణాలకు రూ. 10 వేల అందజేశారు. దీంతోపాటు నధువరుల కుటుంబాలకు చెందిన బంధుమిత్రులకు బిందు ఏర్పాటు కూడా చేశారు. తాజాగా జరిగిన వివాహ మహోత్సవాల్లో 142 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. వీరిలో 136 మంది హిందువులు కాగా, ఆరు ముస్లిం జంటలు ఉన్నాయి. వీరందరికీ ప్రభుత్వం తరఫున అధికారులు నజారానాలు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా...
ఈ సామూహిక వివాహ మహోత్సవంలో ఓ మోసం వెలుగు చూసింది. నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నావో జంట మళ్ళీ వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. గత నెలలో జరిగిన ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకలోనే ఈ జంట వివాహం చేసుకుంది. పెళ్లి తంతు అనంతరం గవర్నమెంట్ అందించిన నగదు, కానుకలను అందుకుంది. మళ్లీ శనివారం జరిగిన కార్యక్రమంలోనూ ఇదే జంట రెండోసారి పెళ్లి చేసుకోవడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే నెలరోజుల క్రితం తీసిన ఫోటోలు, పెళ్లి ఆహ్వాన పత్రికను, తాజా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సెకండ్ మ్యారేజ్ బాగోతం బయటపడింది. ప్రభుత్వం అందించే నగదు, గిఫ్ట్ల కోసమే ఈ జంట మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరి అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి.