ఒక విధంగా బాధను లేదా నొప్పిని మనుషులు ఓర్చుకోగలరని సైన్స్ కూడా చెబుతోంది. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. నొప్పిని సహించే విధానం పర్సన్ టు పర్సన్ మారుతుందని నిపుణులు అంటున్నారు. పెయిన్ ను కొందరు ఎక్కువగా ఫీల్ అవ్వచ్చు. మొత్తానికి నొప్పి, ప్రభావం, సహనం వంటి అంశాలను అర్థం చేసుకోవడం మన మెరుగైన ఆరోగ్యానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. నొప్పిని సహించడం లేదా తట్టుకోవటం అనేది ఒక వ్యక్తి సహేతుకంగా హ్యాండిల్ చెయ్యగల పెయిన్ మొత్తంగా పేర్కొనవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఇది బాధాకరంగా ఉండవచ్చు.
అయినప్పటికీ సహించదగ్గదిగా ఉంటుంది. అధిక నొప్పిని ఓర్చుకోగల వ్యక్తులు సాధారణ లేదా తక్కువ స్థాయి నొప్పిని తట్టుకోగల వారి కంటే ఆ బాధను మెరుగ్గా మేనేజ్ చేయగలరు. అయితే నొప్పిని తట్టుకోవటం పెయిన్ థ్రెషోల్డ్ తో సమానమా..? అంటే కాదు. నొప్పిని ఓర్చుకోవడం, పెయిన్ థ్రెషోల్డ్ రెండు వేర్వేరు విషయాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ థ్రెషోల్డ్ అనేది ఒక ఉద్దీపన. ఒక్కో వ్యక్తికి ఒకోలా మారుతూ ఉంటుంది. పెయిన్ అనేది రూపాల్లో ఉంటుంది. అయినా చాలావరకు మనం మానసిక, శారీరక నొప్పులను తట్టుకోగలం.