చాలామంది నారింజ తొక్కలని ఎండలో ఎండబెట్టి ఆ పొడిని ముఖానికి రాసుకుంటారు. ఇలా రాసుకోవడం వల్ల మొఖంపై టెంపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఆరెంజ్ ను తినేసి తొక్కను పడేస్తున్నారా? తొక్కే కదా అని చీప్ గా చూస్తారా? అయితే ఆరెంజ్ తొక్కలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు. ఆరెంజ్ తొక్క తింటే ఏం జరుగుతుందో తెలుసా. ఆరెంజ్ విటమిన్ సి కి మంచి మూలం అని మనందరికీ తెలిసిందే. చలికాలంలో దాన్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. నారింజ తినటం వల్ల చర్మం, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ తరచూ నారింజ పండ్లను చిన్నప్పుడు వాటి తొక్కలను చెత్తలో వేస్తూ ఉంటాం.

అయితే ఆరెంజ్ తొక్కలు ఎంత మేలు చేస్తుందో తెలుసా? వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ రోజువారి జీవితాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఎలానో అర్థం కావటం లేదా? ఆరెంజ్ తొక్కతో ఆరోగ్యం, అందం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. రోజువారి జీవితంలో నారింజ తొక్కలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఆరెంజ్ పిల్ పౌడర్ ఒక అద్భుతమైన న్యాచురల్ స్క్రబ్. ఇది చర్మం లోని టానింగ్ నం తొలగించి, మొటిమలను తగ్గించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం తొక్కను ఎండబెట్టి పొడి చేసి అందులో తేనె, పాలు మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. దీన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.

జుట్టు కోసం కూడా ఉపయోగించవచ్చు. నారింజ తొక్కలతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది. చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్కలు సహజ సువాసనను కలిగి ఉంటాయి. ఇది ఇంటిని సువాసనగా మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే? తొక్కలను ఎండబెట్టి, పర్సులో నింపి అల్మారాలో లేదా గదిలో ఉంచాలి. అంతేకాకుండా నీటిలో మరిగించడం ద్వారా గదిలో సువాసన వెదజల్లడానికి కూడా ఉపయోగపడుతుంది. నారింజ తొక్కలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది వంటగదిలోని మరకలను తొలగించడంలో సహాయపడతాయి. ఆరెంజ్ తొక్కలను వెనిగర్ ను వేసి కొన్ని రోజులు ఉంచాలి. ఇది సహజ క్లీనర్ గా కూడా ఉపయోగించవచ్చు. నారింజ తిన్న తర్వాత దాన్ని తొక్కలను విసిరేయకండి వాటిని ఈ పద్ధతిలో ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: