అప్పుడే లోపలి నుంచి మంచి గ్లో వస్తుంది. ఇంట్లో కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఖరీదైన క్రీములు కొనక్కర్లేదు. మన ఇంట్లో తక్కువ ధరకు దొరికే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. వీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మనకు ఈజీ గానే లభిస్తాయి. అలా ఇంట్లో ఉండే వాటిల్లో జాజికాయ కూడా ఒకటి. దీన్ని ఎక్కువగా పులావ్ దినుసుల్లో రుచికోసం వాడుతూ ఉంటారు. ఈ జాజికాయ తోనే మన అందాన్ని పెంచుకోవచ్చు. ఈ జాజికాయను పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో అనేక ఔషధ గుణాలు మనకు లభిస్తాయి. ముఖంపై ఉండే మచ్చలు, ముడతలు, పింపుల్స్,
డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. జాజికాయ పొడిని, కొద్దిగా చందనం పొడిని ఓ గిన్నెలో నీళ్లు వేసి మిక్స్ చేయాలి. ఈ విశ్రమాన్ని నేరుగా ముఖాన్ని పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా అరగంటసేపు వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. జాజికాయ పొడిలో కూడా రోజ్ వాటర్ లేదా మిల్క్, తేనె కూడా కలపవచ్చు. ఇలా వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకున్నా.. మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి. చర్మం సాఫ్ట్ గా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాజికాయ పొడిని తప్పకుండా ముఖానికి అప్లై చేసుకోండి.