ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి బ్లడ్ క్లాట్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తున్నావి. బ్లడ్ క్లాట్స్ గురించి ఈ మధ్యకాలంలో చాలామంది వింటూ ఉంటున్నారు. బ్లడ్ క్లాట్స్ అవ్వటం వల్ల ప్రాణానికే ప్రమాదంగా చెప్పొచ్చు. ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి గుండె, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే... రక్త సరఫరా అనేది సవ్యంగా జరగాలి. రక్త సరఫరా సరిగ్గా జరుగుతేనే ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఉండే భాగాలు కూడా ఆరోగ్యంగా పనిచేస్తాయి. రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే ఒక్కోసారి బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. రక్తంలో గడ్డలు ఏర్పడితే..

ఇవి అడ్డంకులు సృష్టించి... హార్ట్ ఎటాక్ ని తెచ్చి పెడతాయి. బ్లడ్ క్లాట్స్ కట్టడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇది సాధారణంగా కరగవు. అలానే శరీరంలో ఉండిపోతే ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఆహారాలు తింటే బ్లడ్ క్లాట్స్ అనేది కరిగిపోతాయి. అంతేకాకుండా రక్తం గడ్డ కట్టకుండా కూడా చేస్తుంది. మరి ఆహారాలు ఏమిటి? ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. విటమిన్ డి అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఈ విటమిన్ ఉన్న ఆహారాలను తరచూ తీసుకుంటే రక్తం అనేది గడ్డకట్టకుండా ఉంటుంది. విటమిన్ డి అనేది మనకు నేచురల్ గా సూర్య రశ్మీ ద్వారా అందుతుంది. అలాగే మష్రూమ్స్, పాలు, చీజ్, కోడిగుడ్లు, చాపలు వంటి ఆహారాల కూడా లభ్యమవుతుంది. వీటిని తీసుకోవటం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

 ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని గుడ్ ఫ్యాట్స్ గా చెబుతారు. ఇవి తీసుకోవటం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి... మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతుంది. ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ అనేవి మనకు గింజల్లో ఎక్కువగా లభిస్తుంది. అవిసె గింజలు, చియా సీడ్స్, అవకాడో, వాల్ నట్స్, చేపలు వంటి వాటిల్లో మెండుగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల రక్త సరఫరా క్రమంగా జరుగుతుంది. బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయి. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి అంతో మీరు చేస్తుంది. తరచూ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: