ప్రతి ఆడవాళ్లు కూడా జుట్టు ఒత్తుగా పెరగాలని అనుకుంటారు. జుట్టు పొడువుగా పెరగటానికి రకరకాల ఆయిల్స్ ని రాస్తూ ఉంటారు. ఒత్తుగా పొడవుగా ఉండే జుట్టు అంటే మహిళలకు చాలా ఇష్టం. ఇలా ఉంటే జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది. పడుగైన జుట్టు కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా చేయండి. నెల రోజుల్లో మీకు ఖచ్చితంగా మార్పులు కనిపిస్తాయి. ఈ ఆయిల్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మహిళల, పురుషుల అందాన్ని పెంచడంలో జుట్టు కూడా ఎంతో ముఖ్యం.

రకరకాల హెయిర్ స్టైల్స్ కారణంగా ఎంతో అందంగా కనిపిస్తారు. అందులోనూ జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటే... ఆ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జుట్టుకు రాలిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కొత్త జుట్టు రాకుండా పచ్చగా మారితేనే సమస్య. మళ్లీ కొత్త జుట్టు పెరిగేలా చేసి... హెయిర్ ఒత్తుగా కనిపించేలా చేయడంలో ఇప్పుడు చెప్పే హోమ్ రెమిడి ఎంతో చక్కగా పనిచేస్తుంది. జుట్టు పొడవుగా పెరగాలని ఇప్పటివరకు ఎన్నో హెయిర్ ఆయిల్ వాడే ఉంటారు. కానీ ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఒక్కసారి వాడిన మీ జుట్టులో వచ్చే మార్పులను మీరు కచ్చితంగా గమనిస్తారు.

ఇందుకోసం మనకు ఉల్లిపాయ, లవంగాలు, మెంతి గింజలు, ఆవనూనె కావాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు సగం ఉల్లిపాయ ముక్కకు ఓ ఐదారు లవంగాలు గుచ్చి ఆ ఆయిల్ లో వేసి.. చిన్న మంట మీద ఓ ఏడు నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత ఆ ఆయిల్ లో కొన్ని మెంతి గింజలు వేయండి. ఆ ఆయిల్ ని తలకు బాగా పట్టించి నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా వారంలో రెండు, మూడుసార్లు రాసి తల స్నానం చేయాలి. ఇలా నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. తప్పకుండా ఈ హోమ్ రెమిడిని పాటించండి. ఇలా చెయ్యటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: