చాలామంది డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం డ్రై ఫ్రూట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ డ్రై ఫ్రూట్స్ తినటం ఆరోగ్యానికి చాలా అవసరం. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న  విషయం తెలిసిందే. వివిధ రకాల డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్లు, విటమిన్లు, మొదలైన వివిధ పోషకాలు అందుతాయి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ తింటే క్యాన్సర్ ను తరిమికొట్టొచ్చు. టైప్ 2 డయాబెటిస్ ను నియంతరించవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గటం, బరువు పెరగటం, ఎముకలను బలోపేతం చేయటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.

కాగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ను ప్రతి రోజు తింటుంటారు. కానీ రోజు డ్రై ఫ్రూట్స్ తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ఛాన్స్ ఉందని తాజా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి. నిజానికి వీటిలో కొవ్వు కేలరీలు అధికంగా ఉంటాయి. కాగా ఎక్కువ తీసుకున్నట్లయితే.. వేగంగా వెయిట్ పెరుగుతారని.. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిపై ఎఫెక్ట్ చూపుతోందని చెబుతున్నారు. ఇవి రోజు తింటే ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. ఈ గింజల్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. కాగా బ్రెజిల్ నట్స్ ఎక్కువగా తింటే బాడీ పెయిన్స్, తలనొప్పి, అలసట వస్తుంది.

ఫైన్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. కానీ అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం బరువు పెరగటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పైన్ నట్స్ లో కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. గుండె బలానికి ఎంతో మేలు చేసే వాటిలో హాజెల్ నట్స్ ఒకటి. ఇవి షుగర్ ను అదుపులో ఉంచడంలో బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. హాజల్ నట్స్ తింటే బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ ఇవి ప్రతిరోజు తింటే మాత్రం శరీర బరువు పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: