చర్మవ్యాధి నిపుణుల ప్రకారం పాత దిండ్లలో దుమ్ము, మైట్స్, ఆయిల్, మృత చర్మ కణాలు ఉంటాయి. ఇవి ఎలర్జీ, చర్మ సంబంధ వ్యాధులతో పాటు గజ్జిని కూడా కలిగించే అవకాశం ఉంది. అందుకే మనం రోజు ఉపయోగించే దిండ్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, దిండు సరైన షేప్ లో లేకపోయినా ఇబ్బందులు తప్పవు. వెన్నుముక, మెడ వంటి ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి. వాటి అలైన్ మెంట్ లో తేడాలు వచ్చి తలనొప్పి, దీర్ఘకాలిక మెడ నొప్పి, బాడీ పోస్టర్ లోనూ మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు.
అందుకే దిండును కనీసం ఒకటి నుంచి రెండేళ్లకైనా మార్చడం ఎంతో అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకముందే తిండు గట్టిపడిన, ఫాట్ గా అవడం లేదా రంగు మారితే వెంటనే మార్చాల్సిన అవసరం ఉంది. ఇలా దిండ్లు, బెడ్లను మార్చినప్పుడు వాటిని చెత్తలో పడేయకుండా ఉపయోగకరంగా వాడితే బాగుంటుంది. అంతే ఆశ్రమాలు లేదా జంతుశాలలకు ఇస్తే ఒకరికి సాయం చేయటంతో పాటు పర్యావరణ పరంగాను ఎంతో మేలు జరుగుతుంది. సింథటిక్స్ తో తయారుచేసిన దిండులను రిసైకిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. కాటన్ లేదా ఇతర ఆర్గానిక్ పదార్థాలతో తయారైనవి సహజంగానే డికంపోస్ అవుతాయని కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు.