ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగటం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజు తాగటం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రోజు ఉదయంనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగటం వల్ల అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పని చేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఉప్పునీరు చాలా ప్రభావంతంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిత్యం నీటిలో ఉప్పు కలిపి తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఉదయమునే ఉప్పు నీరు తీసుకోవటం వల్ల జీర్ణవ్యవస్థలోని ఆమ్లాన్ని సమతుల్యత చేస్తుంది. జీర్ణ అగ్నిని ప్రేరేపిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఉప్పునీరు శరీరానికి అవసరమైన మినరల్స్ అందిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు, వంటి అంటూ వ్యాధులకు వ్యతిరేకంగా మారటానికి సహాయపడుతుంది. ఉప్పు నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలు కూడా తగ్గుతాయి. ఉప్పు నీరు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మొటిమలు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే చుండ్రు తొలుగుతుంది. ఎక్కువ ఉప్పును తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు కలుగుతాయి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగటం వల్ల శరీరంలోని విష పదార్థాలు విడుదలవుతాయి.