జుట్టుకి కోడిగుడ్డు పెడితే జుట్టు స్ట్రాంగ్ గా మృదువుగా ఉంటుంది. గుడ్డు పోషకాల పవర్ హౌస్ గా పిలుస్తారు... గుడ్డులో మన శరీరానికి అవసరమైన 9 అమైనో యాసిడ్స్, ఫోలేట్, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రోటీన్ ఉంటాయి. అందుకే రోజు గుడ్లు తినమని వైద్యులు సూచిస్తుంటారు. అలాంటి గుడ్లు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు... హెయిర్ కేర్ లోనూ సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు జుట్టుకు మంచి సంరక్షణగా పనిచేస్తాయి. గుడ్డులోని పచ్చ సోనా వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తే.. విటమిన్ ఎ, కె, బయోటిన్ లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మీ హెయిర్ కేర్ లో గుడ్డుతో ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గుడ్డులో విటమిన్ ఇ, కొబ్బరి నూనె బాగా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి సుమారు అరగంట పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఇది నిర్జివమైన జుట్టుకు జీవం పోయడంతో పాటు జుట్టు చివర్లు  చిట్లకుండా కాపాడతాయియి. గుడ్డు, ఉసిరి పొడి, లేదా రసం ఉపయోగించి కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం 2 గుడ్లను తీసుకుని ఒక బౌల్లో పగులగొట్టి వేసుకోవాలి. దీనికి 1 స్పూన్ ఉసిరికాయ పొడిని వేసి బాగా కలిసేట్టుగా కొట్టాలి. ఇప్పుడు ఈ విశ్వమాన్ని జుట్టు రూట్స్ నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అలాగే, 20 నుంచి 30 వరకు వదిలేయండి. ఆ తరువాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

ఇది జుట్టు మూలాలను బలంగా, నల్లగా మార్చేస్తుంది. గుడ్డు, ఆలివ్ నూనెతో కూడా జుట్టుకు మంచి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఆలివ్ నూనెను గుడ్డుతో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ లభిస్తుంది. తరచూ ఇలా చెయ్యటం వల్ల జుట్టు మూలాల నుండి బలంగా మారుతుంది. జుట్టు నల్లగా ఒత్తుగా, పొడవుగా, మందంగా మారుతుంది. గుడ్డు, అలోవెరా జెల్ తో హెయిర్ ప్యాక్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ ను గుడ్డులో బాగా కలిపి అప్లై చేయడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ అందుతుంది. ఎగ్ హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గుడ్డు, తేనే కలిపి తయారుచేసిన హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం 2 గుడ్లకు 2 చెంచాల తేనే వేసి బాగా కొట్టి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. మాంసకృత్తులతో కూడిన గుడ్డు జుట్టును బలపరుస్తుంది. తేనే జుట్టును బాగా తేమ చేస్తుంది. ఇది జుట్టును చాలా మృదువుగా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: