విటమిన్ ఎ, బి12, డి, క్యాల్షియం, ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, కొవ్వు వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే చలికాలంలో పాలు తాగటానికి సరైన మార్గం ఏమిటంటే.. శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటిషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. శీతాకాలంలో శరీరాన్ని వెజ్జగా ఉంచేందుకు అదనపు శక్తి అవసరమని, పాలు ఈ అవసరాన్ని తీర్చడంలో సహాయపడతాయని చెప్పారు. అయితే ఈ సీజన్లో పాలు తాగడానికి సరైన మార్గం గురించి తెలుసుకోవాలి. అప్పుడే పాలు తాగటం వలన కలిగే పూర్తి ప్రయోజనం పొందుతారు. తూజు పాలు తాగటం వల్ల ఎముకలు బలపడతాయి. దీనితో పాటు పాలు చర్మం, జుట్టుకు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతున్నాయి. పాలలో విటమిన్ బి12 ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యమైనవి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి.
చలికాలంలో చల్లటి పాలు తాగకూడదని గుర్తించుకోండి అని ప్రియా పలివాల్ చెప్పింది. తెలికాలంలో గోరువెచ్చని పాలు తాగితే చలి నుంచి కాపాడటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. చల్లని వాతావరణం లో ఒక గ్లాసు పాలల్లో చిటికెడు పసుపు లేదా కొద్దిగా తేనె కలపండి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో పాలు తాగే ముందు బాగా వడకట్టి కాసేపు మరిగించాలి. ఇది పాలల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. శరీరానికి ఎటువంటి హాని కలిగించదు. అయితే కొంతమందికి పాలు తాగటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామంది ఎలర్జీలతో బాధపడవచ్చు, మరికొందరికి లాక్టోస్ అసహనం ఉండవచ్చు. ఇలాంటి వారు పాలు తాగితే కడుపు నొప్పి కలుగుతుంది. అయితే ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే.. కచ్చితంగా ఒక్కసారి ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.