యాలకులతో శరీరంలోని టాక్సిన్స్ తొలగిస్తాయి. నోటి దుర్వాసన కూడా దూరం చేసుకోవచ్చు. అధిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో కూడా యాలకులు అద్భుతంగా సహాయపడుతుంది. రక్త పోటును ఎంత రించడంలోయాలకులు బెస్ట్ రెమిడి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాలకులు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయమునే కాళీ కడుపుతో తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా దరిచేరకుండా అడ్డుకుంటుంది. డిప్రెషన్ నుంచి బయట ఉండాలంటే యాలకుల టీ కానీ, పాలు కానీ తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
యాలుకలు తినటం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభిస్తే, అవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ యాలకుల వినియోగం మాత్రం ప్రవాహాన్ని పెంచుతుంది. శరీరాన్ని నిర్విషికరణ చేస్తుంది. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. యాలకులు రక్తపోటును నియంతరించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకులు మెదడుకు రక్త ప్రసన్నను పెంచి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. యాలకులు నోటి దుర్వాసనను తొలగించి, నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.