ఒక వ్యక్తి క్రికెట్ లో రాణించాలంటే.. ఆ ఆటలో ఉండే నిబంధనలను పాటించాలి. సరిహద్దులను గౌరవించాలి. అలా కాకుండా నాదేం పోయిందనుకుంటే ఓటమిపాలవుతారు. అట్లలే లైఫ్ లో ప్రతి ఒక్కరూ తమకంటూ కొన్ని బౌండరీలను సెట్ చేసుకుంటేనే సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది స్వేచ్ఛగా ఉండాలంటే ఎలాంటి బౌండరీస్ ఉండవద్దు అనుకుంటారు. కానీ అన్ని విషయాల్లో ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి జీవితంలో ఆరోగ్యకరమైన సరిహద్దులు కలిగి ఉండటం సక్సెస్ ఫుల్ రిలేషన్ షిప్ కు ఆల్టిమేట్ గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 మీ సమయం మీకు చాలా విలువైనది. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవటం అనేది మీ పరిధిలో ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం వర్క్ లో, ఇంటిలో, సామాజికంగా టైమ్ బౌండరీస్ ను సెట్ చేయటం చాలా ముఖ్యం. అలా సెట్ చేస్తున్నారంటే మీరు వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకుంటున్నారని అర్థం. మీకు అనేక అంశాలు ప్రయారిటీ గా అనిపించవచ్చు. అన్నిటికీ అతిగా కట్టుబడి ఉండకుండా తగినంత సమయాన్ని మాత్రమే కేటాయించండి. మీ ప్రాధాన్యతలను మీరు అర్థం చేసుకున్నప్పుడు.

ఇతర వ్యక్తులకు ఇచ్చే సమయాన్ని పరిమితం చేయటం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు ఈ వారాంతంలో నేను ఆ ఈవెంట్ కి రాలేను, నేను ఒక గంట మాత్రమే ఉండగలను. అనేవి టైమ్ బౌండరీస్ గా పేర్కొనవచ్చు. మీరు సంతోషంగా ఉండాలంటే మీకంటూ ఫిజికల్ బౌండరీస్ కూడా ఉండాలి. అంటే మీ పర్సనల్ స్పేస్ ప్రయారిటీగా దీనిని పేర్కొనవచ్చు. టచ్ విషయంలో కంఫర్ట్ గా ఉండాలనుకోవటం, రెస్ట్ తీసుకోవటం, సమయానికి తినటం, నీరు తాగటం వంటివి శారీరక అవసరాలుగా ఉంటాయి. మిమ్మల్ని టచ్ చేయటం ఇష్టం లేదని లేదా నీకు స్పేస్ కావాలని ఇతరులకు తెలియజేయాలని అనిపించినప్పుడు తప్పక ఆ పని చేయాలి. అలాగే ఆకలితో ఉన్నప్పుడు, రెస్ట్ అవసరం అయినప్పుడు వాటిని వ్యక్తం చెయ్యటం తప్పు కాదనే భావన మీకు ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: