కానీ ఎక్కువ రోజులపాటు 6 గంటలకంటే తక్కువసేపు నిద్రపోతూ ఉంటే మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. త్వరగా వృద్ధాప్యం సంభవిస్తుంది. అయితే అలవాట్లు దీర్ఘకాలం కొనసాగే జీవనశైలి కలిగి ఉండే వ్యక్తుల జీవితం 2050 నాటికి ఎలా ఉంటుంది? అప్పటికి వీరి శరీరంలో వచ్చే మార్పులేమిటి? అనే విషయమై ప్రస్తుతం నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తగినంత నిద్ర లేకపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో అనే విషయమై బ్రిటన్ కు చెందిన స్లిప్ ఎక్స్ పర్ట్ ఒకరు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. అందుకు సంబంధించిన డిజిటల్ ఇమేజ్ లను కూడా షేర్ చేశారు. ' బెన్సర్ ఫర్ బెడ్స్' సమస్త పరిశోధన ప్రకారం... రాత్రులు తక్కువ నిద్రపోయే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే 2025 లో ఎక్కువమంది ఎదుర్కొనే సమస్యల్లో చిన్న వయసులోనే వృద్ధుగా కనిపించే అవకాశం ఉంది.
అంతేకాకుండా తరచుగా వెన్నునొప్పి బారిన పడటం, స్కిన్ డల్ గా, అంద విహీనంగా మారటం, కాళ్లు, చేతుల్లోవాపు, కండరాలు సన్నబడటం, కళ్ళు ఎర్రబడటం వంటి ప్రాబ్లమ్స్ అత్యంత ఎక్కువ మంది ఫేస్ చేస్తారు. ఇక నిద్రలేమి రోగనిరోధక శక్తికి దారి తీయడం వల్ల మళ్ళీ వివిధ వైరస్ లు, ముఖ్యంగా ప్లూ బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు తగ్గుతాయి. ఒబేసిటీ, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి రోగులు అత్యధిక మందికి కేవలం నిద్రలేమి కారణంగా తలెత్తే ఛాన్స్ ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరంలో జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకోవాలని, ముఖ్యంగా నాణ్యమైన నిద్రకూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. నేషనల్ స్లిప్ ఫౌండేషన్ ప్రకారం.. ఒక రోజులో వ్యక్తులు ఏ వయసులో ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో వివరిస్తున్నారు. O నుంచి 3 నెలల వయసు గల శిశువుల్లో ఒక రోజు స్లీప్ టైమింగ్ 14 నుంచి 17 గంటలు ఉండాలి. హెచ్చుతగ్గుల విషయానికి వస్తే 9 గంటలకంటే తక్కువ, 19 గంటలకంటే ఎక్కువ నిద్రపోవటం ఆరోగ్య దయకం కాదు.