అవేంటో ఇప్పుడు చూద్దాం. జామకాయలను తింటే ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తాయో వాటి ఆకులతో తయారు చేసిన టీ కూడా శరీరానికి అంతే ఒక యోజనం కలిగిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, లికోపెన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని సంరక్షిస్తాయి. జామ ఆకుల్లో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. దీంతో బీపీ లెవెల్స్ స్థిరంగా ఉంచుతుంది. జామ ఆకుల్లో షుగర్ లో ఉండే సుక్రోజ్, మాల్టోజ్ ను శోషించుకునే గుణం ఉంటుంది. వీటిలో ఉండే ప్రత్యేకమైన ఎంజైములు జీర్ణాశ్రయంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ను గ్లూకోస్ గా మారుస్తాయి.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించి గుండె జబ్బులు, ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్నవారు జామ ఆకుల్ని తీసుకుంటే మంచిది. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. జామ ఆకులను తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకులతో తయారు చేసిన టీ చర్మం, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై మచ్చలు పోగొట్టే విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జామ ఆకుల టి జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది. ఇతర సమస్యలను నయం చేస్తుంది. జామ ఆకులను నీటిలో ఉడికించి, ఆ నీటిని చుట్టూ కుదుళ్లకు మసాజ్ చేయటం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది.