పెరుగు మాదిరిగానే, తులసి రసం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడం సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. కాబట్టి పెరుగు, తులసి రసాన్ని కలిపి ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినటం వల్ల బరువు తగ్గుతారు. పెరుగు, తులసి ఇష్టమా అని చర్మానికి అప్లై చేయటం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తులసి రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి.
ఇది చర్మంపై మచ్చలు, మొటిమలను వదిలించుకోవటానికి సహాయపడుతుంది. పెరుగు, తులసి ఆకుల రసాన్ని రెగ్యులర్గా ఉపయోగించటం వల్ల చర్మం సహజమైన మెరుపును పొందుతుంది. పెరుగు, తులసి కలిపి తినడం వల్ల జీర్ణప్రియ మెరుగు పడుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. తులసి రసం కడుపు మంట, ఆమ్లతను తగ్గిస్తుంది. పెరుగు, తులసి కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. మానసిక ఒత్తిడిని పెంచడానికి హార్మోన్ బాధ్యత వహిస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.