పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ చాలా సదాసిదాగా జీవించే ఈ నటుడు 75 ఏళ్ల వయసులో కూడా పర్ఫెక్ట్ ఫిట్ గా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ రహస్యాలను పంచుకున్నారు. తాను ప్రతిరోజు ఒకటిన్నర నుండి రెండు గంటల వ్యాయామాలు చేస్తానని, నా శరీరమే నా ఆయుధం, నేను 75 సంవత్సరాల వయసులో కూడా ఫిట్ గా ఉన్నాను. అద్దం ముందు నిలబడటం నాకు ఇప్పటికీ ఇష్టం. ఈ వయసులో ఫిట్ నెస్ కోసం వారు అనుసరించేవి చాలా ఉన్నాయన్నారు. నానా పడేకర్ ప్రతిరోజు జిమ్ లో బెంచ్ ప్రెస్, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్స్ చేస్తుంటారు.
కానీ మీరు జింకు వెళ్లలేకపోతే ఇంట్లో సిట్-అపలు, నమస్కారాలు చెయ్యమని సూచించారు. ఇది కాకుండా, అతను ధూమపానానికి దూరంగా ఉంటాడు. అలాగే తన ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారము ... నానా పడేకర్ లాగా మీరు కూడా 75 ఏళ్ల వయసులో ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు క్రమం తప్పకుండా ఏరోబిక్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ చెయ్యవచ్చు. ఇది శరీరాన్ని చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి వారం 150 నిమిషాల మితమైన, 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి.