దయ వంటి గుణాలు అలవాడుతాయి. అలాంటి కొన్ని అలవాట్లను ఇక్కడ మనం పరిశీలిద్దాం. ఇతరుల నుంచి మనకు ఏదైనా లభించినప్పుడు వారికి కృతజ్ఞతలు చెబితే ఎదుటివారు సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ పని పిల్లలు చేస్తే మరింత ఉత్సాహనిస్తుంది. ఇది పిల్లలకు రోజువారి అలవాటుగా నేర్పించాలి. ప్రాక్టిస్ చేయించాలి. పిల్లలు ఇతరులతో ప్రేమతో నడుచుకునేలా అలవాటు చేయాలి. దయతో కూడిన ప్రతి చర్య... స్నేహితుడికి సాయం చెయ్యటం లేదా చెత్తను తీయడం వంటివి మంచి ప్రభావాలను కలిగిస్తాయి.
ఎవరినైనా మెచ్చుకోవటం, ఇతర పిల్లలతో కలిసి బొమ్మలను పంచుకోవడం వంటి అంశాలను వారిని నిత్యం నేర్పిస్తూ ఉండాలి. ఇలాంటి చర్యలు పిల్లల్లో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. బుద్ధి మానవులకు సూపర్ పవర్. ఈ క్షణం పై దృష్టి పెడ్డెలా పిల్లలను చిన్నప్పటి నుంచి డ్రైయిన్ చేయాలి. ధ్యానం, ఇంద్రియాల పై నియంతరణ వంటి అంశాలను నేర్పించాలి. ఇలా చిన్నప్పటి నుంచి చేస్తే వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో ప్రశాంతంగా జీవించగలరు. పిల్లలకు నేర్పించాల్సిన అంశాల్లో క్రమాగుణం ఎంతో ముఖ్యమైనది. కోపం, ఆగ్రహాలు వారి హృదయాన్ని బరువుగా మారుస్తాయి. క్రమాగుణం అలవాడితే మనసును తేలికపరిచేందుకు సాయం చేస్తుంది.