కేవలం కళ్ళతోనే మాట్లాడొచ్చు. మరి ఆ కళ్ళకు అందాన్ని తెచ్చేవి ఐబ్రోస్. కనుబొమ్మలు ఒత్తుగా అందంగా కనిపిస్తే.. మొఖం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ కొంతమందికి కనుబొమ్మలు అనేవి చాలా సన్నగా ఉంటాయి. వీటిని ముద్దుగా కనిపించేలా చేయడానికి పెన్సిల్, ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇవి తాత్కాలికమే. కనుబొమ్మలు ఒత్తుగా కనిపించాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి. ప్రతిరోజు కొబ్బరి నూనెను కనుబొమ్మలపై రాస్తూ ఉండాలి. కాసేపు మర్దన చేస్తే... అక్కడ రక్త ప్రసన్న బాగా జరిగి కనుబొమ్మలు ఒత్తుగా మారుతాయి.
కేవలం కొబ్బరి నూనె కాకుండా నూనెలు కూడా చక్కగానే పనిచేస్తాయి. ఆయుదం పూర్వకాలం నుంచి వాడకాల్లో ఉంది. ఇప్పుడు ఆముదాన్ని ఎవరు పెద్దగా ఉపయోగించడం లేదు. కానీ ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ ఆముదాన్ని ప్రతిరోజు కనుబొమ్మలపై రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. ఐబ్రోస్ ని తరచూ దువ్వినా కూడా పెరుగుతాయి. ఆలివ్ ఆయిల్, బాదం నూనె కూడా మంచివే. వీటిల్లో కూడా అనేక పోషకాలు ఉంటాయి. వీటిని రాత్రి నిద్రించే ముందు కనుబొమ్మలపై రాసి... ఓ రెండు నిమిషాలు మర్దన చేయాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. కనుబొమ్మలు ఒత్తుగా అందంగా కనిపిస్తే.. మొఖం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ కొంతమందికి కనుబొమ్మలు అనేవి చాలా సన్నగా ఉంటాయి.