విడాకులు తీసుకున్న తన కూతురిని బ్యాండ్ మేళంతో వేడుకగా ఇంటికి తీసుకువచ్చాడో తండ్రి. ఆనక బంధుమిత్రులందరికీ భారీ విందు ఏర్పాటు చేశాడు .. జార్ఖండ్లో జరిగిన ఈ సంఘటన దేశమంతా చర్చినీ యాంశం అయ్యింది. హరియానా కు చెందిన ఓ యువకుడు తన భార్యతో విడిపోయి ఏడాది గడిచిన సందర్భంగా ఆమెను పోలిన ఓ బొమ్మను తయారు చేయించి ఆ బొమ్మ సమక్షంలో తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఎక్కడో ఒక అమ్మాయి .. అబ్బాయి పరిచయం అవుతారు. మాటలు భావాలు పంచుకుంటారు .. జీవితాంతం కలిసుందాం అనే ప్రమాణం చేస్తారు ..అది పెద్దలు కుదిర్చిన సంబంధమే కావచ్చు .. అయినా ఎక్కడో తేడా కొడుతుంది .. కొన్నాళ్లకే ప్రేమ మబ్బులు పెడతాయి. బేదాభిప్రాయాలు మొదలవుతాయి. ఇక సర్దుకు పోలేం కలిసి అస్సలు ఉండలేం అని బ్రేకప్ చెప్పేసుకుంటారు.


విడాకులకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి .. అయితే విడిపోవటాన్ని ఒక బాధాకరమైన విషయంగా ఎవరు భావించడం లేదు. పెళ్లి పెటాకులవగానే గతంలోనే అమ్మాయిలు తలని మోకాళ్ల పై పెట్టుకుని ఏడుస్తూ కూర్చోవట్లేదు. అబ్బాయిలు దేవదాసు లా అయిపోవడం లేదు. విచిత్రమైనటువంటి పెళ్లి చేసుకున్నప్పుడు అతిధులకు ఘనంగా పార్టీలు ఇస్తున్నట్టే విడిపోయాక కూడా వేడుకలు చేసుకుంటున్నారు .. ఇది సంతోషించాల్సిన విషయం కాక మరేంటి పైగా ఇది డైవర్స్ పార్టీ అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో గ్రూపులు గ్రూపులు క‌డుతున్నారు .. కలిసి బతకలేనప్పుడు విడిపోవడమే నయం .. ఆ తర్వాత ఇలా అయింది ఏంటి అని జీవితం అంతా బాధపడటం కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం బెటర్ అని అంటున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు డైవర్స్ పార్టీలు చేసుకుంటున్నా.రు ఈ ట్రెండ్ మెట్రో నగరాలు .. పట్టణాల్లో మొదలవుతోంది .. పల్లెల వరకు ఇంకా చేరలేదు. భవిష్యత్తులో డైవర్స్ తీసుకున్న వాళ్ళందరూ ఒకే చోటచేరి పార్టీలు చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక్కడ ఏమీ లేదు విడిపోయిన వాళ్ళు ఆ బాధను మర్చిపోయి హ్యాపీగా కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: