కపం మొదలు గొంతు నొప్పి వరకు సమస్యలకు ఉపశమనం కలిగించే ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం. నిమ్మకాయ, మిరియాలు కలిపి తీసుకోవటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో మిరియాల పొడిని వేసుకుని తీసుకోవటం వల్ల కపం సమస్య దూరమవడే కాకుండా గొంతు క్లియర్ అవుతుంది. ఒక కప్పు వేడి నీటిలో టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు నల్ల మిరియాలు కలుపుకొని తీసుకోవాలి. పసుపు పాలు కూడా శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోనే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఛాతిలో పీకపోయినా కపాన్ని తొలగిస్తాయి.
రోగ నిరోధక శక్తి పెరిగి... శరీరానికి విశ్రాంతి లభించి మంచి నిద్ర లభిస్తుంది. ఒక గ్లాసు వేడి పాలలో అడా టీ స్పూన్ పసుపు కలుపుకుని తీసుకుంటే శ్వాస సమస్యలకు దూరం అవుతాయి. తులసి, లవంగంతో టీ చేసుకునే తాగిన మంచి ఫలితం ఉంటుంది. రోజు ఉదయమునే పరగడుపున రోజు ఈ డ్రింక్ తీసుకుంటే గొంతు నొప్పి ని తగ్గించడంతోపాటు, కపం తగ్గి శ్వాస తీసుకోవటంలో ఉపశ్రమమం లభిస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షించటంతో పాటు వాపును కూడా తగ్గిస్తుంది. కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు తీసుకుని ఇందులో 2 లవంగాలు వేసి మరిగించాలి. అనంతరం పడకట్టి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.