అలాగే చికెన్ ఎంత కాలం నిల్వ ఉండాలి కూడా తెలుసుకుందాం. రోజు ఇంట్లోనే ఒకేరమైన ఆహారమా అంటూ చాలామంది అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళుతుంటారు. ఎందుకంటే సాధారణంగా రెస్టారెంట్లలోని ఫుడ్ రుచికరంగా ఉంటుందని...ఫుడ్ ఎక్స్ పైరి లేదా పరిశుభ్రతకు సంబంధించిన సమస్య ఉండదని నమ్మకం. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు గురించి తెలిస్తే ఎవరైనా రెస్టారెంట్ కు వెళ్లాలంటే ఆలోచిస్తారు. వాస్తవానికి తెలంగాణలోని సికింద్రాబాద్ లోని రెస్టారెంట్లలో 10 కిలోల గడువు ముగిసిన ముడి చికెన్, లేబుల్ లేని నూడుల్స్ కనుగొన్నారు. ఏదైనా గడువు ముగిసిన ఆహారం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఏది ఏమైనాప్పటికీ భారతదేశంలో చాలా మంది ప్రజలు చికెన్ తినటానికి ఇష్టపడుతున్నారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (2019-19-21) నివేదిక ప్రకారం ఒక వారంలో 57.3 శాతం పురుషులు, 45.1 శాతం మహిళలు చికెన్ లేదా ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ తింటారు. అటువంటి పరిస్థితిలో చికెన్ తినే వ్యక్తులు గడువు ముగిసిన చికెన్ తినడం ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం ముఖ్యం. అయితే ముందుగా చికెన్ ని ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు తెలుసుకుందాం. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ముడి చికెన్ ను రిఫ్రిజిరేటర్ లో సుమారు 1-2 రోజులు ఉంచవచ్చు. అదేవిధంగా ఉడికించిన చికెన్ రిఫ్రిజిరేటర్ లో సుమారు 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. చికెన్ ను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి మందగిస్తుంది.