చాలామంది ఉసిరికాయలను ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఉసిరికాయ కర్రీ తిన్నారా? ఈ కర్రీని ఎప్పుడైనా చూశారా? ఉసిరికాయలతో ఎక్కువగా చాలామంది పచ్చడ్లు పెడుతూ ఉంటారు. కానీ ఉసిరితో కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా అంటారు. కాస్తూ పుల్లగా ఉన్న ... రుచి మాత్రం అదుర్స్ అంతే. మరియు ఉసిరికాయలతో కర్రీ ఎలా తయారు చేస్తారు? ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ప్రతిరోజు చిన్న ఉసిరిముక్క తిన్న ... ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా గా ఉంటుంది. ఇది చర్మానికి, జుట్టు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఉసిరికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పచ్చి ఉసిరికాయలను ఉడకబెట్టుకోవాలి. ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత నీటిని వంచేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి దోరగా వేయించి చల్లార్చుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

 ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తరువాత కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, విక్స్ పట్టిన పొడి వేసి అన్ని ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక పక్కన పెట్టిన ఉసిరి మొక్కలు కూడా వేసి అన్ని చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దింపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ కర్రీ సిద్ధం. వీటిల్లోవంకాయలు, బెండకాయలు, ములక్కాయ కూడా వేసి వండుకున్న చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: