సరిగ్గా నిద్రపో లేకపోతే దీర్ఘ కాలిక వ్యాధుల ముప్పు రావటం కూడా ఖాయం. రాత్రిపూట త్వరగా పడుకోవాలంటే.. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా త్వరగా ముగించుకుని... సరైన సమయానికి నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. రాత్రి త్వరగా పడుకుంటే.. ఉదయం త్వరగా లేవచ్చు. నిద్ర బాగా పట్టాలంటే శరీరం అలిసిపోవాలి. శరీరంలో అలసిపోవటం వల్ల నిద్ర త్వరగా పడుతుంది. రాత్రిపూట డిన్నర్ 7 గంటలకు కంప్లీట్ చేసే ... నిద్రపోయే ముందు చిన్నపాటి ఎక్సెస్ సైజులు చేయండి. ఇలా చేయటం వల్ల కూడా నిద్ర పడుతుంది.
మీమీ బెడ్ రూమ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. గది ప్రశాంతంగా ఉంటేనే నిద్ర అనేది చక్కగా పడుతుంది. బెడ్ షిట్, దిండు కూడా మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే గంట ముందు నవ్వు తెప్పించే వీడియోలు చూడండి. టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. మీ మనసును కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. చాలామందికి రాత్రి నిద్రపోయే ముందే అన్నీ గుర్తుకు వస్తాయి. అలాకాకుండా ముందే అన్ని ముగించుకుని పడుకోవటం అలవాటు చేసుకోండి. బ్రీతింగ్ ఎక్సెస్ సైజులు చెయ్యండి. కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండండి.