మధుమేహాన్ని నియంతరించడానికి రోజు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి కొన్ని యోగ ఆసనాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు దీనిపై పరిశోధనలు చేశారు. రోజు 50 నిమిషాల యోగ చేయటం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని వీరి పరిశోధనలు చెబుతున్నాయి. న్యూఢిల్లీలోని AllMSలోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడికల్ సైన్సెస్ ప్రోఫెసర్ డాక్టర్ పునీత్ మిశ్రా ఏం చెబుతున్నారంటే... యోగా చేయటం వల్ల షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహ రోగులు 3 నెలల పాటు యోగా చేయటం వల్ల వారి శరీరంలో హెచ్ బి1ఏసి స్థాయి గణనీయంగా తగ్గింది. ఈ రోగులకు మందులతో పాటు యోగ కూడా చేయించారు.
మరి కొంతమంది రోగులతో యోగా చేయించలేదు. యోగా చేసిన వారి షుగర్ స్థాయి అదుపులో ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనలో 50 నిమిషాల యోగ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇది చక్కెర స్థాయిని నియంతరించడంలో ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధాన యోగాసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలన్నీ రోజు ఒకో నిమిషం చప్పున వెయ్యాలి. మార్జారి ఆసనాన్ని క్యాట్ పోజ్ అన్నీ కూడా అంటారు. ఇందులో ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులను తొడలపై ఉంచాలి. పాదాలను భుజం- వెడల్పు వేరుగా ఉంచాలి.