ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రష్ ని చేస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రం బ్రష్ చేసే సమయంలో వాంతింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కొంతమందికి ఉదయం సమయంలో బ్రష్ చేసేటప్పుడు మాటిమాటికి వాంతి అవుతూ ఉంటుంది. ఇలా ఒకటి రెండుసార్లు అయితే పరవాలేదు. కానీ మాటిమాటికి ఇలా జరిగితే మాత్రం అప్రమత్తం కావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ చాలామంది దీనిని సాధారణ సమస్యగా పరిగణిస్తారు.

ఇది కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే కాకుండా తరచుగా పళ్ళు తోముకున్న ప్రతిసారి ఈ సమస్య తలెత్తితే ప్రమాదకరం. మళ్లీ మళ్లీ వాంతులు కావడం వల్ల చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా తిన్న తర్వాత బ్రష్ చేసేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే... ఇందకు గళాకారణాలను అన్వేషించాలి. పొట్ట సమస్యలు కూడా దీనికి ఒక కారణం. దీన్ని వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు ట్రై చేయండి. పెద్ద బ్రష్ కు బదులు చిన్న టూత్ బ్రష్ వినియోగించాలి.

 అనేక సందర్భాల్లో పెద్ద బ్రష్ ను ఉపయోగించటం వల్ల నోటి లోపల ప్రదేశం తక్కువగా ఉండటం వల్ల వాంతి ధోరణి పెరుగుతుంది. అలాగే కఠినంగా ఉండేది కాకుండా మృదువైన బ్రష్ ని ఉపయోగించాలి. నెమ్మదిగా బ్రష్ చేయాలి. కొన్నిసార్లు టూత్ పేస్ట్ కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. తక్కువ ఫోమింగ్ ఉన్న టూత్ పేస్ట్ ని ఉపయోగించాలి. క్కువ నురుగు కారణంగా వాంతి ధోరణి కూడా తగ్గుతుంది. మీరు బ్రష్ చేయడానికి ముందు నోటిలో కొంచెం నీరు పోసుకుని పుక్కలించాలి. అనంతరం బ్రష్ చేయాలి. ఇది వికారం సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను కూడా ఉపయోగించవచ్చు. అయినా సమస్య కొనసాగితే మర్చిపోకుండా డాక్టర్ని సంప్రదించండి. ముఖ్యంగా తిన్న తర్వాత బ్రష్ చేసేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: