అంతేకాకుండా ఈ అలవాటు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. పిల్లలకి ఫోన్ చూపించడం వల్ల చాలా రోగాలు వస్తాయి. మీ పిల్లలు భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ లను చూస్తూ... ఆ అలవాటును ఎంత కష్టమైనా మాన్పించడం మంచిది. పిల్లవాడు మొబైల్ ఫోన్ చూస్తూ తిన్నప్పుడు, వారు అతిగా తింటారు లేదా తక్కువగా తింటారు. అండే వారు ఆకలితో ఉన్న దానికంటే తక్కువ తింటారు. ఒక్కసారి తిండి మీద ధ్యాస లేక అతిగా తింటారు. అదిగా తినటం వల్ల ఊబకాయం వస్తుంది. తక్కువ తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఫోన్ చూస్తూ పిల్లలు ఆహారాన్ని నమలకుండా మింగేస్తారు. ఇది జీర్ణ క్రియను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ చూడటం వల్ల పిల్లల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
అవసరానికి తగినట్లు తినకపోతే అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఫోన్ చూడటం వల్ల పిల్లలకు కాళ్లు చెడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువగా స్క్రీన్ ను చూస్తే పిల్లల కళ్ళు అలసిపోతాయి. దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే పిల్లవాడు ఫోన్ చూస్తూ సరిగ్గా తినడు. శరీరానికి పోషణ అందదు. దీంతో మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఫోన్ చూడటం పిల్లల సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. ఇది పెరుగుదలలోనూ ప్రభావం చూపిస్తుంది. ఫోన్ చూస్తున్నప్పుడు, పిల్లవాడికి ఆకలి వేయదు. దీంతో సరిగ్గా తినరు. ఫలితంగా శరీరం పోషకాహార లోపాన్ని గురవుతుంది.