రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవటానికి ఈ ఏడు కారణాలే అని నిపుణులు అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒత్తిడి కారణంగా పీరియడ్ సమయానికి రావు. స్ట్రెస్పి పిరియడ్స్ చక్రాన్ని నిర్వహించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. కాగా ప్రతి చిన్న విషయానికి బత్తిడికి లోనవ్వకూడదు. నిద్ర సరిగ్గా లేకపోతే కార్టిసాల్, మెలటోనిన్ హార్మోన్ల పై ప్రభావం చూపుతుంది. పునరుత్పత్తి హార్మోన్ల బ్యాలెన్స్ లో అవాంతరాలు ఏర్పడతాయి. కాగా రోజూ ఒకే సమయానికి పడుకుని.. ఒకే టైమ్ కు లేవడం అంవాటు చేసుకోవాలి. శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం. ఐరన్, విటమిన్ డి లోపం ఉన్నట్లైతే... అది హార్మోన్ల ఉత్పత్తి పై ఎఫెక్ట్ చూపిస్తుంది. తద్వారా పిరియడ్స్ ను నియంత్రించడంలో తోడ్పడతుతాయి.
కాగా విటమిన్ డి, ఐరన్ లోపం రాకుండా చూసుకోండి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. గంటల తరబడో ఒకే దగ్గర కూర్చోని పని చేయడం కూడా వెయిట్ పెరగడానికి ఓ కారణమని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను పెంచి.. ఋతుచక్రం పై ఎఫెక్ట్ చూపుతుంది. ఎక్కువగా పిండితో చేసిన వంటకాలు తినటం వల్ల బాడీలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. అంటే పాలిష్డ్ రైస్, కార్న్ ఫ్లోర్ వంటి వంటకాలు... ఇవి బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా పీరియడ్స్ రెగ్యులర్గా రావని నిపుణులు చెబుతున్నారు.