మెంతికూర సహాయంతో మనం అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చు... మెంతులలో ప్రోటీన్, టోటల్ లిపిడ్, ఎనర్జీ, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి నీరు తాగటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? ఎప్పుడు తాగాలి... ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి... వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం చాలా ముఖ్యం.. అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి...

మెంతులను మసాలా దినుసులుగా.. భారతీయ గృహాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. మెంతులతో పాటు ప్రజలు మెంతుకూరను కొన్నిసార్లు కూరగాయలలో, కొన్నిసార్లు పరాటాలలో కలిపి తింటారు.. ఇంకా మెంతులతో లడ్డూలు కూడా తయారు చేసుకుని తింటారు. అయితే... మెంతులు వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మనలోనే కొంతమందికి చాలా తక్కువ తెలుసు. ఆయుర్వేద నిపుణులు అభిప్రాయం ప్రకారం, మెంతులు అనేక రకాల విటమిన్లు, కనిజాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు ప్రకారం... మెంతులు, మెంతికూర ఆహారంతో మనం అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చు.

 కాబట్టి మెంతి నీరు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? దీనిని ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం. మెంతి నీరు శరీరాన్ని నిర్విపికరణ చేస్తుంది. ఈ నీటిని తాగటం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రోజు ఉదయముని మెంతికూర నీరు తాగటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మలోపేతం చేయడానికి మెంతి మీరు దివ్యఔషధంలా పనిచేస్తుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. ఈ నీటిని తాగటం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశ్రమంలో లభిస్తుంది. మెంతులు బరువు తగ్గటంలో ప్రభావంతంగా పనిచేస్తాయి. నిత్యం మెంతికూర, మెంతి నీళ్లు తాగితే ఊబకాయం త్వరగా తగ్గుతుంది. దీనికోసం ఈ మెంతులను బాగా నమిలి తినండి ... దీని ప్రభావం త్వరలోనే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: