పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహాన్ని నియంతరించడంలో మిరపకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గటానికి చాలా ప్రభావంతంగా ఉంటుంది. జీర్ణక్రియను పెంచుతుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. పచ్చిమిర్చి... మనందరి ఇళ్లల్లో పచ్చిమిర్చి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే.. కూరలు, పచ్చళ్ళు, ఊరగాయలు... ఇలా ప్రతి వంటకంలో మిరపకాయలు వాడుతుంటారు.

ఘూటు వంటకాలను ఇష్టంగా తినేవారు మరింత రుచి కోసం పచ్చిమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పచ్చిమిర్చి కేవలం రుచి, షూటు కోసం మాత్రమే కాదు... పుష్కలమైన పోషకాలు కూడా అందిస్తుందని మీకు తెలుసా..? బజ్జి మిరపకాయలో ఐరన్, పొటాషియం, విటమిన్లు సి, ఎంతో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ సరైన శారీరక పని తీరుకు కీలకమైనవి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. పచ్చిమిరపకాయలలో ముఖ్య పదార్థం క్యాప్సెసిన్.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. క్యాప్సైసిన్ వేడిని ఉత్పత్తి చేయటం ద్వారా జీర్ణక్రియను పెంచుతుంది. వేగవంతమైన జీవక్రియ నిల్వ చేయబడిన కొవ్వు విచ్చన్నం అయిపోయి బరువు తగ్గటం జరుగుతుంది.

మిరపకాయలలో విటమిన్ B5 ఉండటం వల్ల కొవ్వు ఆమ్లాల విచ్చన్నం సులభం అవుతుంది. ఇక పచ్చిమిరపకాయలు క్యాలరీలు కూడా ఉండవు. పచ్చిమిరపకాయలు విటమిన్ ఎ ను పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇది కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి. పచ్చిమిరపకాయలు ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి చర్మాన్ని బిగుతూగా, ముఖ్యంగా ఉంచేందుకు అవసరమైన అవసరమైన కోల్లాజెన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఫైటోన్యూట్రియెంట్స్ ముడతలు, మచ్చలు, మొటిమలు, దద్దుర్లకు సమర్థవంతంగా చికిత్స చేస్తాయి. ఇక విటమిన్ ఈ శరీరానికి మేలు చేసే సహజమైన నూనెలను నృష్టిస్తుంది. భోజనంతోపాటు సంతోషాన్ని ఇస్తుందని.. ఆందోళనను తగ్గిస్తుందని పలు ఆధ్యాయాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: