భారతదేశంలో ప్రతి సంవత్సరం మధుమేహం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో 10 కోట్లకు పైన ఏ వ్యాధి కేసులు నమోదయ్యయని lcmr నివేదిక తెలియజేస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య మరింత పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ప్రతి మూడో వ్యక్తికి వస్తుందనే భయం ఉంది. డయాబెటిస్ అనేది జీవితకాల వ్యాధి, దీనిలో రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటుంది. మధుమేహం అత్యంత సాధారణ రూపం డైప్ 2 మధుమేహం... అయితే.. తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
అయితే, మధుమేహం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకోండి. మధుమేహం రెండు రకాలుగా ఉంటుందని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రి అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ అంజిత్ కుమార్ చెబుతున్నారు. ఒకటి చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల వచ్చేది టైప్ 2.. మరొకటి జన్యుపరమైనమైనది అదే టైప్ 1. టైప్ 1 పుట్టినప్పుడు సంభవించవచ్చు. అటువంటి పరిస్థితులు, నివారణ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ మీరు టైప్ 2 మధుమేహాన్ని నివారించవచ్చు. దీనికోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవటం ముఖ్యం. డైలీ ఈ రొటీన్ పాటిస్తే మధుమేహం నుంచి కాపాడుకోవచ్చునని చెబుతున్నారు.